Home >> News >> World>> బీపీఆర్‌ విఠల్‌ మృతికి తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

బీపీఆర్‌ విఠల్‌ మృతికి తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
Published Date :6/19/2020 9:59:27 AM
బీపీఆర్‌ విఠల్‌ మృతికి తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

 హైదరాబాద్‌ : మాజీ ఐఏఎస్‌ అధికారి, ప్రముఖ ఆర్థికవేత్త, అంతర్జాతీయ ద్రవ్యనిధి మాజీ ప్రతినిధి బీపీఆర్‌ విఠల్ (93) మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. బీపీఆర్‌ విఠల్‌ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన కుటుంబసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు,ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా 1950 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన బీపీఆర్‌ విఠల్ 1972 నుండి 1982 వరకు ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక, ప్రణాళిక కార్యదర్శిగా పని చేశారు. బీపీఆర్‌ విఠల్‌కు భార్య శేషు, కుమార్తె నివేదిత కుమార్‌, కుమారులు సంజయ్‌ బారు, చైతన్య బారు ఉన్నారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సంజయ్‌ బారు మీడియా సలహాదారుగా వ్యవహరించారు.

 
 

 
Related News Articles