Home >> News >> Nation>> నేర చరిత్ర ఉన్న రాజ‌కీయ‌వేత్త‌ల‌కు సుప్రీంకోర్టు షాక్

నేర చరిత్ర ఉన్న రాజ‌కీయ‌వేత్త‌ల‌కు సుప్రీంకోర్టు షాక్
Published Date :2/14/2020 10:49:26 AM
నేర చరిత్ర ఉన్న రాజ‌కీయ‌వేత్త‌ల‌కు సుప్రీంకోర్టు షాక్

నేర చరిత్ర ఉన్న రాజ‌కీయ‌వేత్త‌ల‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. అలాంటి నేత‌ల‌ను మోస్తున్న రాజ‌కీయ పార్టీలు త‌మ వెబ్‌సైట్ల‌లో ఆ క‌ళంకిత నేత‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది.  48 గంట‌ల్లోనే వారి వివ‌రాల‌ను వెబ్‌సైట్ల‌లో పెట్టాల‌ని ఇవాళ ఆదేశించింది. ఎటువంటి నేత‌ల‌పై ఎటువంటి నేరానికి సంబంధించిన కేసులు ఉన్నాయో, వారిని ఎందుకు  పార్టీలో చేర్చుకున్నారో అన్న అంశాల‌ను త‌మ త‌మ వెబ్‌సైట్ల‌లో పొందుప‌రుచాల‌ని కోర్టు త‌న తీర్పులో రాజ‌కీయ పార్టీల‌ను ఆదేశించింది. రాజ‌కీయ‌ల్లో క్రిమిన‌ల్స్ పెరుగుతున్నార‌ని కోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. జ‌స్టిస్ ఆర్ఎఫ్ నారీమ‌న్‌, ర‌వీంద్ర భ‌ట్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పునిచ్చింది.
Related News Articles