Home >> News >> Latest News>> టివి9 మాజి CEO రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు

టివి9 మాజి CEO రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు
Published Date :10/6/2019 9:08:41 AM
టివి9 మాజి CEO రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు

టీవీ9 అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బోర్డు తీర్మానం లేకుండా దాదాపు రూ.18 కోట్లు చీటింగ్‌ చేసిన కేసులో ఆ టీవీ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 2017–18, 2018–19 సంవత్సరాల కం పెనీ లాభాలకు సమానంగా బోనస్, ఎక్స్‌ గ్రేషియాల కింద రూ.18,31,75,000 నగదు డ్రా చేశారని, అయితే టీడీఎస్‌ మినహాయింపుల తర్వాత రూ.11,74,51,808గా బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లో కనిపిస్తోందని అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ జి.సింగారావు బంజారాహిల్స్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

టీవీ9 లోని 90.54 శాతం మెజారిటీ షేర్‌హోల్డింగ్‌ను ఈ ఏడాది ఆగస్టు 27 నాటికి అలందా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. కొత్త బోర్డు డైరెక్టర్లు సంస్థ రికార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలించగా, రవిప్రకాశ్, ఎంవీకేఎన్‌ మూర్తిలు మోసపూరితంగా డబ్బులు డ్రా చేశారని తేలింది. 2018 సెప్టెంబర్‌ 18న , 2019 మార్చి 3న,మే 8న రవిప్రకాశ్‌ రూ.6,36,000, 2018 అక్టోబర్‌ 24, డిసెంబర్‌ 10, 2019 మే 8న ఎంవీకేఎన్‌ మూర్తి రూ.5,97,87,000లు, కంపెనీ డైరెక్టర్‌ క్రిఫర్డ్‌ పెరీరా 2018 అక్టోబర్‌ 24, డిసెంబర్‌ 10, 2019 మే 8న రూ.5,97,87,000 డ్రా చేసినట్లు గుర్తించారు. వీరు ముగ్గురు కలిసి కింద రూ.18,31,75,000 డ్రా చేశారని రికార్డులను బట్టి తెలిసింది. కంపెనీకి నష్టం కలిగించడంతో పాటు మోసపూరితంగా చేసిన లావాదేవీలను బోనస్, ఎక్స్‌గ్రేషియా రంగుపులిమే ప్రయత్నం చేశారు. బోర్డు తీర్మానం లేకుండా అలాంటివి ఇచ్చే వీలుండదు. కంపెనీ షేర్‌హోల్డర్స్‌ జనరల్‌ మీటింగ్‌లో ఆమోదం తీసుకోకుండానే బోనస్, ఎక్స్‌గ్రేషియాగా రికార్డు చేయాలని అకౌంటెంట్లకు వారు సూచించినట్లు తెలిసింది. ‘సెప్టెంబర్‌ 24న జరిగిన బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ మీటింగ్‌లో ఈ మోసపూరిత లావాదేవీలపై పూర్తిస్థాయి చర్చలు జరిగాకే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని నిర్ణయించాం. ఆ నగదును తిరిగి రాబట్టేందుకు న్యాయపరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించాం’అని ఫిర్యాదులో జి.సింగారావు పేర్కొన్నారు.

టివి 9 మాజీ సిఈఓ రవిప్రకాష్ పై ఏకంగా వంద కోట్ల అబియోగం వచ్చినట్లు వార్తలు సూచిస్తున్నాయి. రవిప్రకాష్ ను అరెష్ట్ చేసి చంచలగూడా  తరలిఒంచారు మొత్తంగా 12 కొట్ల చీటింగ్ ..చీటింగ్ జరిగింది అని అలందా ఛేఓ సింగారావు ఫిద్యాదు . ఈ చీటింగ్ లో ముగ్గురు ఉన్నారని వీరిలో .. రవిప్రకాష్, మూర్తి ,క్లిపర్డ్ బోర్డ్ డైరెక్టర్స్ అనుమతి లేకుండా చెక్ పవర అదికారాన్నిదుర్వినీయోగం చేసి నిదులను కాజేసారు అని ఆని ఆడిట్ లో వెల్లడి అయింది ఈ నిదులు క్రమ డ్రాజేసింట్టూ ఫిర్యాడులో పేర్కోన్నారు ..నష్ట పరిహారం బోనస్ లంటూ దుర్వినియోగం చేసారు ...ఆ డబ్బును . రవిప్రకాష్, మూర్తి ,క్లిపర్డ్ దుర్వినియోగం చేసినట్టూ పక్కా సమాచారంతో కేసునమొదు ...ఈ లావా దేవిలన్ని 18 సెప్టంబర్ నుంచి 20019 మె మద్య జరిగినట్టూ ఫిర్యాడు దాదాపుగా 12 కోట్ల మేర దుర్వినియోగం చేసినట్టూ పక్కా సమాచారం ఈ నిదులను దెనికోసం వినియోగించారు ..అన్న విషయం పై తెలాల్సి ఉంది రవిప్రకాశ్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి సీతాఫల్‌మండిలో మేజిస్ట్రేట్‌ ముందు ముందు హాజరుపర్చగా.. 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. అనంతరం చంచలగూడ జైలుకు తరలించారు. రవిప్రకాశ్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేయగా.. దీనిపై ఈ నెల 9న విచారణకు రానుంది.
 
Related News Articles