వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’ విడుదల అవుతున్న ఈ చిత్రంపై కొద్ది రోజులుగా చిత్ర టైటిల్ విషయంలో వివాదం నడుస్తుంది. వాల్మీకి టైటిల్‌కి గన్ ఉంచడంపై బోయ హక్కుల పోరాట సమితి మండిపడింది. సినిమా టైటిల్ మార్చాలని హైకోర్ట్‌లో పిటీషన్ కూడా వేసింది. దీంతో టైటిల్ మార్చాలని చిత్రబృందానికి హైకోర్ట్ నోటీసులు పంపడంతో వాల్మీకి చిత్ర టైటిల్‌ని ‘గద్దలకొండ గణేశ్’గా మారుస్తున్నట్టు హరీష్ శంకర్ ప్రెస్‌మీట్ ద్వారా తెలిపారు. అయితే ఈ వివాదం ఇంకా ముగిసినట్టు కనిపించడం లేదు. పేరు మార్చినట్టు ప్రచారం మాత్రమే చేస్తున్నారు. సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్స్‌తో పాటు మిగతా వాటిలో వాల్మీకి అనే ఉంది. ఆ పేరు మార్చే వరకు ఆందోళన కొనసాగిస్తాం అని వాల్మీకి సంఘం నేతలు అంటున్నారు.