జనసేన మద్దతుదారుల ట్విట్టర్ అకౌంట్లు నిలిపివేతపై అభ్యంతరం తెలుపుతూ.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. జనసేన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న ట్విట్టర్ ఇండియా.. నిలిపివేసిన ట్విట్టర్ ఖాతాలను పునరుద్ధరించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ ఇండియాకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ తాజాగా ట్వీట్ చేశారు. జనసేన మద్దతుదారుల ఖాతాలను పునరుద్ధరించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను సంరక్షించారని పేర్కొన్నారు. సమయానికి స్పందించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.