Home >> News >> Nation>> నేపాల్‌లో నేరం.. భారత్‌లో అరెస్ట్‌

నేపాల్‌లో నేరం.. భారత్‌లో అరెస్ట్‌
Published Date :11/21/2018 8:37:26 AM
నేపాల్‌లో నేరం.. భారత్‌లో అరెస్ట్‌

 తమదేశంలో మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి అనంతరం భారత్‌కు పారిపోయి వచ్చిన నిందితుడ్ని నేపాల్‌ పోలీసులు గురుగ్రావ్‌ సమీపంలో అరెస్ట్ చేశారు. వివరాలు.. నేపాల్‌లోని చితావన్ జిల్లా భరత్‌పురకు చెందిన 27 ఏళ్ల రాజన్ బిక అనే వ్యక్తి తన ఈ నెల 10న ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రాజన్‌పై కేసు నమోదు చేశారు. దాంతో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు రాజన్ తన భార్యతో కలిసి ఇండియాకు పారిపోయి వచ్చాడు.

నేపాల్ నుంచి సునౌలి బార్డర్ మీదుగా న్యూఢిల్లీకి చేరుకున్నాడు. రాజన్‌ మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసిన పోలీసులకు.. అతను ఇండియాలో ఉన్నాడని తెలిసింది. దాంతో నిందుతున్ని  అరెస్ట్‌ చేసేందుకు నేపాల్‌ పోలీసులు స్పెషల్ టీంను న్యూఢిల్లీ పంపించారు. పోలీసులతో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు గురుగ్రావ్‌ సమీపంలో రాజన్‌ని అరెస్ట్‌ చేశారు. అనంతరం అతన్ని నేపాల్‌కు తీసుకెళ్లి చితావన్‌ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. రాజన్‌ను10 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Related News Articles