గలు అందరూ చూస్తుండగానే నలుగురు దుండగులు కారులో వచ్చి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. ఇదంతా చుట్టు పక్కల జనం చూస్తూ కూడా ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ కిడ్నాప్ వ్యవహారం సీసీటీవీల్లో రికార్డవడంతో ఆ వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో హల్చల్ చేస్తోంది.
బాధితుడు అహ్మదాబాద్‌కు చెందిన చిరు వ్యాపారస్థుడని సమాచారం. తన పనుల నిమిత్తం తరచూ ఉదయ్‌పూర్ వస్తూ ఉంటాడు. అయితే అతన్ని అపహరించడానికి ప్రయత్నించింది ఎవరు?.. వ్యాపారంలో ఏమైనా గొడవలు ఇందుకు కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.