Home >> News >> Latest News>> ధరలు దరువేస్తుంటే దర్జాగా చూస్తుంటారా?

ధరలు దరువేస్తుంటే దర్జాగా చూస్తుంటారా?
Published Date :5/22/2020 11:16:19 AM
ధరలు దరువేస్తుంటే దర్జాగా చూస్తుంటారా?

రాష్ట్ర వ్యాప్తంగా అధిక ధరలను అదుపు చేయాలని ఆదేశించింది. ధరలను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను ఈ నెల 26 నాటికి సమర్పించాలని, తదుపరి విచారణను ఈ నెల 27న జరుపుతామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాç Üనం ఉత్తర్వులు జారీ చేసింది. నిత్యావసరాల ధరలు పెరిగాయని పత్రికల  వార్తా కథనాన్ని పిల్‌గా పరిగణించి గురువారం మరోసారి విచారణ జరిపింది.ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. అధిక ధరలకు విక్రయాలు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఆదేశాలిచ్చారని చెప్పారు. జంటనగరాల్లో అధిక ధరలకు విక్రయించే వారిపై 290 కేసులు నమోదు చేశారని తెలిపారు.  దీనికి ధర్మాసనం స్పందిస్తూ..ఇళ్లకే పరిమితమైన పేద, మధ్యతరగతి ప్రజలు ఎలా జీవించాలని ప్రశ్నించింది.

 
 

 




Related News Articles