Home >> News >> Nation>> దారుణం: ఆగిన లిఫ్టు.. ఆ సమయంలో..

దారుణం: ఆగిన లిఫ్టు.. ఆ సమయంలో..
Published Date :3/9/2020 1:10:58 PM
దారుణం: ఆగిన లిఫ్టు.. ఆ సమయంలో..

ఆగిఉన్న లిఫ్టులో బధిర మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడో వ్యక్తి. ముంబైలోని మేఘ్‌వాడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొన్నిరోజుల క్రితం మేఘ్‌వాడిలోని జోగేశ్వరికి చెందిన ఓ బధిర యువతి తల్లితో కలిసి ఆసుపత్రిలో ఉన్న తండ్రిని చూడటానికి వెళ్లింది. అనంతరం ఇద్దరూ తాముంటున్న హౌసింగ్‌ కాంప్లెక్స్‌కు తిరిగివచ్చారు. పై అంతుస్తుల్లో ఉన్న ఫ్లాట్‌కు వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కారు. అదే కాంప్లెక్స్‌లో ఉంటున్న ఓ 50 ఏళ్ల వ్యక్తి వారితో పాటు లిఫ్ట్‌ ఎక్కాడు. నాలుగవ అంతస్తుకు రాగానే లిఫ్ట్‌ ఆగిపోయింది. మహిళ తల్లి మొదట లిఫ్టులోంచి బయటకు చేరుకుంది.ఈ సమయంలో లోపల ఉన్న అతడు బధిర మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు సంజ్ఞల ద్వారా తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లికి వివరించింది. అంతేకాకుండా గతంలోనూ అతడు తనపై లైంగిక దాడి చేసినట్లు తెలిపింది. బాధితురాలి తల్లిదండ్రులు ఈ విషయంపై అతన్ని నిలదీయగా ఎదురుదాడికి దిగాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.




Related News Articles