Home >> News >> Latest News>> షామీర్పేట్ మండలం అలియాబాద్ సర్పంచ్ కుమార్ యాదవ్ పై అవినీతి ఆరోపణలు

షామీర్పేట్ మండలం అలియాబాద్ సర్పంచ్ కుమార్ యాదవ్ పై అవినీతి ఆరోపణలు
Published Date :2/19/2020 8:45:24 AM
షామీర్పేట్ మండలం అలియాబాద్ సర్పంచ్ కుమార్ యాదవ్ పై అవినీతి ఆరోపణలు
 
షామీర్పేట్ మండలం అలియాబాద్ సర్పంచ్ కుమార్ యాదవ్ పంచాయతీ నిధులను దొంగ బిల్లులతో 32 లక్షల వరకు పంచాయతీ వార్డు సభ్యుడు కనుకల లింగం ఎంపీటీసీ సభ్యులు సగ్గు శ్రీనివాస్ ఆరోపించారు. షామీర్పేట్ లోని హరిత లేక్ వ్యూ రిసార్ట్ లో సర్పంచ్ అవినీతిపై విలేకరులకు వివరించారు. అలియాబాద్ గ్రామ పరిధిలో హరితహారం మొక్కలు నాటేందుకు లక్షల్లో ఖర్చు చేసినట్లుగా ఇష్టారాజ్యంగా డ్రా చేసినట్లు ధ్వజమెత్తారు. ప్రభుత్వ పంచాయతీరాజ్ నియమ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టం వచ్చినట్లు దొంగ బిల్లులు సృష్టించి  సంబంధిత పంచాయతీ కార్యదర్శి సంతకాలు లేకుండా నిధులను స్వాహా చేస్తున్నారన్నారు. సర్పంచ్ గా గెలిచిన నుంచి ఇప్పటివరకు ఈ ఏడాది కాలంలో వివిధ పనులు చేసినట్లు 70 లక్షలును డ్రా చేసినట్లు చెప్పారు. అందులో 32 లక్షలు దొంగ బిల్లులను సృష్టించి ఇంజనీరింగ్ శాఖ నుంచి ఎంబీ రికార్డులు వార్డు సభ్యులు తీర్మానం లేకుండా నిధులను డ్రా చేసి దుర్వినియోగానికి పాల్పడినట్లు వారు ఆరోపించారు తన సోదరుడు శంకర్ యాదవ్ (రూ.2 76 లక్షల)  వార్డు సభ్యుల భర్తలు పి నరేష్ గౌడ్      
(రూ 2.55) , ఎస్ మల్లేష్ యాదవ్ (  రూ. 4.91లక్షలు ) రెండు చెక్కులు పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న కారో బార్లు, సిబ్బంది అకౌంట్లోకి దొంగ బిల్లులతో నిధులను మళ్లించి అవినీతికి పాల్పడ్డాడని అన్నారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఒక్కపైసా డ్రా చేయకూడదని నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేసిన దాఖలాలు లేవన్నారు ఎలాంటి తీర్మానం లేకుండా పద్నాలుగవ ఫైనాన్స్ నిధులు రూ.33 లక్షలు సైతం అభివృద్ధి పనులు చేయకుండా మింగేశాడు అని ఆరోపించారు సర్పంచ్ కుమార్ యాదవ్ అంతులేని అవినీతికి పాల్పడినట్లు తమ వద్ద అన్ని సాక్షాధారాలు ఉన్నాయని తాము ఎక్కడైనా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు అలాగే వ్యాపారులతో కుమ్మక్కై వారిని ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసినట్లు చెప్పారు దీంతో సుమారు మూడు కోట్ల మండిపడ్డారు జిల్లా కలెక్టర్ పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ పూర్తి ఆధారాలతో ఫిర్యాదు పత్రాలు సమర్పించినట్లు తెలిపారు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అవినీతి పై న్యాయ విచారణ జరిపి నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయం లో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేస్తే జిల్లా కలెక్టర్ మండల కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి ధర్నా కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు.
[2/19, 9:35 AM] 99Tv Crime Bureau: సనత్ నగర్ లో దారుణం 
 
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చితకబాదిన దంపతులు 
 
రోడ్డుపై ఆడుకుంటున్న విద్యార్థులను గోల చేస్తున్నారంటూ విచక్షణారహితంగా కొట్టిన భార్య భర్తలు 
 
కాళ్లపై పడ్డ కనికరించని కఠినాత్ములు 
విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు రంగంలోకి దిగిన సనత్ నగర్ పోలీసులు
 
 సీసీ పుటేజ్ ఆధారంగా దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు



Related News Articles