News
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి..ఇండియగ్యాస్ మోసం
సనత్ నగర్ లో దారుణం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చితకబాదిన దంపతులు
షామీర్పేట్ మండలం అలియాబాద్ సర్పంచ్ కుమార్ యాదవ్ పై అవినీతి ఆరోపణలు
పోలీసు స్టేషన్ పరిధిలోని హాఫిజ్ పెట్ వద్ద కారు భీభత్సం
ఫిర్యాదు చెయ్యడనికి వచ్చినా మహిళతో ఎస్సై వివాహేతర సంబంధం..
ఉగ్రవాది కరీం తుండా కేసులో తుది తీర్పు వచ్చేనెల 3 వతారుకు కు వాయిదా
బంజాాహిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మంత్రి కాన్వాయ్ రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్ జీ ఐ పోలిస్ స్టేషన్ కు చేరుకున్న ప్రముఖ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దిశ సినిమా తీసేందుకు ప్రయత్నం.
తెలంగాణ ముఖ్యమంత్రి KCR కు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్
హోమ్ మినిష్టర్ ,తెలంగాణ డీజీపీమహేంద్ర రెడ్డి
Home >> News >> Latest News>> చంచల్‌గూడ జైలులో రవిప్రకాశ్‌.

చంచల్‌గూడ జైలులో రవిప్రకాశ్‌.
Published Date :10/6/2019 9:13:02 AM
చంచల్‌గూడ జైలులో రవిప్రకాశ్‌.

దాదాపు రూ.18 కోట్లు చీటింగ్‌ చేసిన కేసులో  అరెస్ట్‌ అయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ చంచల్‌గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో ఉన్నారు. కోర్టు ఆయనకు ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్‌ విధించడంతో శనివారం రాత్రి 10 గంటలకు జైలుకు తరలించారు. రవిప్రకాశ్‌కు జైలు అధికారులు అండర్‌ ట్రయిల్‌ ఖైదీ నెంబర్‌ 4412ను కేటాయించి... కృష్ణా బ్యారక్‌లో ఉంచారు.  ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్న ఆయన రాత్రంతా సరిగా నిద్రపోలేదని సమాచారం.  ఉదయం రవిప్రకాశ్‌కు జైలు సిబ్బంది అల్పాహారంగా కిచిడీ ఇవ్వగా, సగం తిని వదిలేసినట్లు తెలుస్తోంది. ఇక ఆయన బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 9న వాదనలు జరగనున్నాయి.కాగా రవిప్రకాశ్.. మరో డైరెక్టర్ ఎంకేవీఎస్ మూర్తితో కలిసి కుట్రకు పాల్పడి అక్రమ మార్గంలో రూ.18 కోట్లను సొంతానికి వాడుకున్నారంటూ ప్రస్తుత టీవీ9 సీఈవో గొట్టిపాటి సింగారావు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, రవిప్రకాశ్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్‌ విధించడంతో శనివారం రాత్రి 10 గంటలకు జైలుకు తరలించారు.

source :- www.sakshi.com/
Related News Articles