Home >> News >> Latest News>> ఆంధ్రప్రదేశ్ పైబర్ గ్రిడ్ ప్రైవేటు పరం కానుందా..?

ఆంధ్రప్రదేశ్ పైబర్ గ్రిడ్ ప్రైవేటు పరం కానుందా..?
Published Date :10/5/2019 3:22:41 PM
ఆంధ్రప్రదేశ్ పైబర్ గ్రిడ్ ప్రైవేటు పరం కానుందా..?
తక్కువ ధరలో సామాన్యుడికి కేబుల్ ప్రసారాలతోపాటు, ఇంటర్నేట్ సౌకర్యాన్ని చేరువలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైబర్ గ్రిడ్ ఏర్పాటు చేసింది.  ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆ రాష్ట్రంలోని ఎమ్.ఎస్.ఓలు తీవ్ర వ్యతిరేకత కనబరచారు.  పైబర్ గ్రిడ్ విస్తరిస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఆ రాష్ట్రంలోని ఎమ్.ఎస్.ఓలు ఆందోళన వ్యక్తం చేశారు.  దీనితో  ఎమ్.ఎస్.ఓలకు ఇబ్బంది కలగని రీతిలో ప్రస్తుత ఏ.పి. పైబర్ గ్రిడ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
ఇక ఏ.పి.లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పైబర్ గ్రిడ్ కు ప్రాదాన్యత ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.  ఒక దశలో పైబర్ గ్రిడ్ ను మూసివేస్తారని కూడా ప్రచారం సాగింది.  దీనితో విజయవాడకు చెందిన ఎమ్.ఎస్.ఓ., సిటికేబుల్ ఎం.డి. పొట్లూరి సాయిబాబు రంగంలోకి దిగారు.  గతంలో టిడిపిలో ప్రముఖ నేతగా చలామణి అయి ప్రస్తుతం వైసిపి తీర్ధం పుచ్చుకున్న తన సమీప బందువు సహాకారంతో పైబర్ గ్రిడ్ ను హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సాయిబాబుకు చెందిన సిటీకేబుల్ కార్యకలాపాలు విజయవాడకే పరిమితమయ్యాయి.  పైబర్ గ్రిడ్ ను హస్తగతం చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ రంగంలో తనదైన ముద్ర వేయవచ్చనేది సాయిబాబు ఆలోచనగా ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.  
సాయిబాబు పైబర్ గ్రిడ్ ను సొంతం చేసుకునే ప్రయత్నాల పట్ల రాష్ట్రంలోని ఇతర ఎమ్.ఎస్.ఓలు కొంత ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తుంది.  ప్రభుత్వ సహాకారంతో పైబర్ గ్రిడ్ ను విస్తరించి తమ వ్యాపారాలను దెబ్బకొట్టాలని సాయిబాబు ప్రయత్నిస్తారని ఇతర ఎమ్.ఎస్.ఓలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఈ నేపధ్యంలో సాయిబాబును ఎదుర్కునేందుకు ఏంచేయాలి అనేదానిపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.
సాయిబాబు ప్రయత్నాలకు ప్రభుత్వం ఏ విదంగా స్పందిస్తుంది అనేదానిపై ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కేబుల్ భవితవ్యం ఆదారపడి ఉంటుంది.  సాయిబాబు ప్రయత్నాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఏ.పి.లో కేబుల్ వార్ రసకందాయంలో పడే అవకాశం ఉంది.



Related News Articles