Home >> News >> Latest News>> చనిపోయాడనుకున్న మనిషిలో కదలికలు

చనిపోయాడనుకున్న మనిషిలో కదలికలు
Published Date :9/20/2019 3:40:01 PM
చనిపోయాడనుకున్న మనిషిలో కదలికలు
హైదరాబాద్‌ వైద్యులు చనిపోయాడని నిర్ధారించారు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. అంబులెన్స్‌లో తీసుకొస్తుండగా అతను కదిలాడు. శ్వాస ఆడుతుండటం, నాడీ సైతం కొట్టుకుంటుండటంతో ఖమ్మం ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని గంటలపాటు చికిత్స పొందిన అతను చివరకు తుదిశ్వాస విడిచారు. చివరకు విషాదాంతంగా మారింది.
తూటికుంట్ల గ్రామానికి చెందిన నల్లమోతు విశ్వనాథం(35) ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం బుధవారం హైదరాబాద్‌ తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ చనిపోయాడని అక్కడి వైద్యులు ఇంటికి తీసుకెళ్లమని చెప్పడంతో గురువారం ఉదయం అంబులెన్స్‌లో ఇంటికి బయలుదేరారు. విషయం గ్రామస్థులకు చెప్పడంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు సైతం చేశారు. హైదరాబాద్‌ నుంచి తూటికుంట్ల వస్తూ మధ్యలో కొణిజర్ల వద్ద అంబులెన్స్‌ డ్రైవర్‌ భోజనం చేయడానికి ఆగారు. భోజనం చేసి తిరిగి బయలుదేరడానికి అంబులెన్స్‌ తలుపు తీయగా చనిపోయాడనుకున్న మనిషి కదులుతున్నాడు. శ్వాస తీసుకుంటున్నాడు. దీంతో అంబులెన్స్‌లో ఉన్న బంధువులు స్థానిక వైద్యుని దగ్గరకు తీసుకెళ్లారు. ఇతను బతికే ఉన్నాడు.. నాడి కూడా సక్రమంగానే కొట్టుకుంటోందని చెప్పడంతో తిరిగి ఖమ్మం వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని గంటల పాటు చికిత్స పొందిన విశ్వనాథం రాత్రి తుదిశ్వాస విడిచారు.



Related News Articles