Home >> News >> Latest News>> మరోసారి కాల్పులతో ఉల్కిపడిన అమెరికా

మరోసారి కాల్పులతో ఉల్కిపడిన అమెరికా
Published Date :9/20/2019 3:34:47 PM
మరోసారి కాల్పులతో ఉల్కిపడిన అమెరికా

కాల్పుల ఘటనతో అమెరికా మరోసారి ఉల్కిపడింది. ఈ సారి ఏకంగా వైట్‌హౌజ్‌ సమీపంలో కాల్పులు చోటు చేసుకోవడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 10 గంటల సమయంలో కొలంబియా రోడు 14వ వీధిలో గుర్తు తెలియని దుండగులు విచక్షాణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 
Related News Articles