Home >> News >> World>> యువతితో మఠాధిపతి ప్రేమ సంభాషణలు..

యువతితో మఠాధిపతి ప్రేమ సంభాషణలు..
Published Date :9/19/2019 4:15:35 PM
యువతితో మఠాధిపతి ప్రేమ సంభాషణలు..
ఓ యువతితో ఓ పీఠాధిపతి జరిపిన ప్రేమ సంభాషణలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  కర్ణాటక యాదగిరి జిల్లాలోని కణ్వమఠం స్వామీజీ విద్యావారధి తీర్థ చిక్కుల్లో పడ్డారు.  ఓ యువతితో సన్నిహితంగా మాట్లాడటం, ఇద్దరం సహకరించుకుందామని చెప్పడం, ఎవరికీ అనుమానాలు రాకుండా భక్తురాలి రూపంలో రావాలని సూచించడం వంటి సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. సదరు యువతి తరచుగా స్వామిజి  మఠానికి వచ్చేదని, దింతో ఆమెకు  స్వామీజీతో పరిచయం పెరిగిందని,  ఇదే తరుణంలో వారిద్దరి మధ్య  ప్రేమ పెరిగిందని అంటున్నారు. మరోవైపు, స్వామీజీకి సన్నిహితంగా ఉన్నవారే కుట్రలకు పాల్పడినట్టు సమాచారం.
 
అయితే దీని వెనుక భారీ కుట్రే ఉందని అంటున్నారు కొందరు. వాట్సాప్ లోని ఫొటోలు చూపకుండా సదరు యువతి జాగ్రత్త పడిందని వాపోతున్నారు. ఆ యువతి  స్వామీజీని కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు సమాచారం. మరోవైపు తనపై జరుగుతున్న ప్రచారంపై స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు రుజువయ్యేంత వరకు మఠాధిపతిగా కొనసాగనని, ధ్యానంలోకి వెళ్తానని  స్వామిజి ప్రకటించారు.
 



Related News Articles