Home >> News >> Films>> నాగార్జున వ్యవసాయ పొలంలో మృతదేహం

నాగార్జున వ్యవసాయ పొలంలో మృతదేహం
Published Date :9/19/2019 4:08:07 PM
నాగార్జున వ్యవసాయ పొలంలో మృతదేహం

టాలీవుడ్ హీరో నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం స్థానికంగా కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా  షాద్ నగర్ నియోజకవర్గం  కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ పరిధిలో ఉన్న నాగార్జునకు సంబంధించిన పొలంలో దొరికిన ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడులా ఉంది. కాగా తన 58 ఎకరాల పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడకు పంపారు. అయితే పొలంలోకి వెళ్లిన తర్వాత ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన ఈ మృతదేహాన్ని వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నేడు ఉదయం సంఘటన స్థలాన్ని  క్లూస్ టీం తో  పరిశీలించిన డీసీపీ ప్రకాష్ రెడ్డి. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఆ శవం దొరికిన గదిని సీజ్ చేశారు.మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై దర్యాప్తును ప్రారంభించారు. మూడు సంవత్సరాల క్రితం అతడు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన చాకలి పండుగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతడిది హత్యనా లేక ఆత్మహత్యనా.. అన్నది ఇంకా తేలాల్సి ఉంది. 




Related News Articles