Home >> News >> Cobra News Exclusive>> మీ సెల్ ఫోన్ లోకి చైనా చొరబడుతోంది.Cobre News Exclusive Report.

మీ సెల్ ఫోన్ లోకి చైనా చొరబడుతోంది.Cobre News Exclusive Report.
Published Date :7/3/2019 5:44:47 PM
మీ సెల్ ఫోన్ లోకి చైనా చొరబడుతోంది.Cobre News Exclusive Report.

టిక్ టాక్, టిక్ టాక్... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదో మాయలా పరిణమించింది. స్మార్ట్ ఫోన్ యూజర్లని అయస్కాంతంలా లాక్కుంటోంది. చిన్న పిల్లలు మొదలు పెద్దవాళ్ళ దాకా దీనికి ఒకరకంగా బానిస అయిపోయారు. ఇక మహిళలు అయితే చేస్తున్న పిచ్చి చేష్టలు.. వేస్తున్న అర్థం లేని స్టెప్పులు చూసేవాళ్లను వికారానికి గురి చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు...పెద్దవాళ్లకు వ్యసనం, చిన్నపిల్లలు బానిసలు..చైనా కేంద్రంగా టిక్‌టాక్ ఊహించని అరాచకం...కొన్ని సందర్భాల్లో టిక్ టాక్ యాప్ వీడియోలు వికృత చేష్టలకు అడ్రస్ గా మారుతున్నాయి. ప్రధానంగా పెద్దవాళ్లకు వ్యసనంగా పరిణమిస్తోంది. చిన్న పిల్లలను ఈ యాప్ బానిసలుగా మార్చుకుంటోంది. ఇప్పటికే ఈ యాప్ వెర్రి చేష్టలను గుర్తించిన దేశ అత్యున్నత న్యాయస్థానం టిక్ టాక్ యాప్ ను నిషేధించింది. ఆ తర్వాత కొన్ని షరతులతో తిరిగి అనుమతించింది. దీంతో ఈ యాప్ అభిమానులకు ఊరట లభించింది. కానీ టిక్ టాక్ అనే ఈ యాప్ చైనా కేంద్రంగా ఊహించని ఆరాచకానికి పాల్పడుతోంది. భారతీయుల డేటా చోరీ చేస్తోంది.అవును.. వినడానికి భయం వేస్తున్నా ఇది నిజంగా నిజం. ఆధారాలతో నిరూపితమైన వాస్తవం. హైద్రాబాద్ కు చెందిన సైబర్ నిపుణులు నల్లమోతు శ్రీధర్ టిక్ టాక్ యాప్ అసలు నైజాన్ని బట్టబయలు చేశారు. ఆ యాప్ ఎలా మన డాటాను తస్కరిస్తుందో స్క్రీన్ షాట్స్ కూడా తీశారు. కొన్నేళ్లుగా.. సైబర్ క్రైమ్స్ పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న నల్లమోతు శ్రీధర్.. తాజాగా టిక్ టాక్ యాప్ గురించి వస్తున్న ఆరోపణలు నిజమా, కాదా అన్న కోణంలో పరిశీలించారు.టిక్ టాక్ యాప్ ను స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకొని.. దాన్ని వినియోగిస్తున్న సమయంలో.. తన స్మార్ట్ ఫోన్ లోని డేటా ఎలా చైనాకు తరలిపోతుందో గుర్తించారు. టిక్ టాక్ యాప్ యూజర్ల డేటా ని చైనా సర్వర్లకు చేరవేసే విధంగా ఉమెంగ్‌ లైబ్రరీని ఎంబెడ్ చేసింది. ఆ తతంగం అంతా  సైబర్ నిపుణులు నల్లమోతు శ్రీధర్  డివైజ్ లో వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది.ఉమెంగ్‌ అనేది చైనాకు చెందిన అనాలిటిక్స్ సంస్థ. గూగుల్ అనాలిటిక్స్ మాదిరిగానే.. ఉమెన్గ్ చైనా అనాలిటిక్స్ సంస్థ. కానీ ఇందులో డేటా అంత సురక్షితంగా భద్రపరచ బడుతుందన్న నమ్మకం లేదు. అయినా. అసలు టిక్ టాక్ యూజర్ల డేటా ఉమెంగ్ లైబ్రరీకి చేరవేయాల్సిన అవసరం ఏముందన్నది ఇక్కడ ప్రశ్న.వాస్తవానికి సైబర్ క్రైమ్స్ పై నిరంతరం పరిశోధన సాగించే నల్లమోతు శ్రీధర్.. తాజాగా టిక్ టాక్ బండారం మీద దృష్టి పెట్టడం వెనుక ఓ కారణం ఉంది. సోమవారం పార్లమెంట్ లో ఎంపీ శశిథరూర్ ఓ అంశాన్ని లేవనెత్తారు. భారతీయుల డేటాను టిక్ టాక్ యాప్ చైనా సర్వర్లకు  చేరవేస్తోందని చెప్పారు. సాక్షాత్తు పార్లమెంటులో ఓ ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తడంతో దానికి ఆధారాలు సేకరించాలనుకున్నారు నల్లమోతు శ్రీధర్. తనదైన శైలిలో టిక్ టాక్ ఆరాచకాన్ని బయట పెట్టారు.టిక్ టాక్ ఊబిలోచిక్కుకున్నవాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. లేదంటే.. ముఖ్యమైన డేటా చోరీ అయ్యాక పోలీసులను ఆశ్రయించినా ఫలితం ఉండకపోవచ్చు. కాబట్టి టిక్ టాక్ బండారం బయట పడిన నేపథ్యంలో ముందుగానే అప్రమత్తం కావాలని హెచ్చరిస్తోంది Cobra News హెచ్చరిస్తోంది..

 
 



Related News Articles