Home >> News >> Latest News>> నగరంలో మృగాళ్లు

నగరంలో మృగాళ్లు
Published Date :6/23/2019 10:07:37 AM
నగరంలో మృగాళ్లు

మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కుమార్తెపై లైంగికదాడికి పాల్పడిన తండ్రిని శుక్ర వారం నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివ రాల్లోకి వెళితే..నేరేడ్‌మెట్‌ పరిధిలో నివాసం ఉం టున్న  రాజేష్‌ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా అతను మద్యానికి బానిసగా మారా డు. వారం రోజుల క్రితం మద్యం మత్తులో ఇంటి వచ్చిన అతను విచక్షణ కోల్పోయి ఐదేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన అతడి భార్య నేరేడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.జగద్గిరిగుట్ట రిక్షాపుల్లర్స్‌ కాలనీకి చెందిన ఎల్లయ్య (60) తన ఇంటి సమీపంలో ఉండే ఐదేళ్ల చిన్నారిని మామిడి పండు ఇప్పిస్తానని మభ్యపెట్టి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. దీంతో చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చి ఆమెను రక్షించిన సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ఎల్లయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.




Related News Articles