Home >> News >> Latest News>> ప్రేయసితో పెళ్లి చేయించాలని యువకుడి హల్‌చల్‌

ప్రేయసితో పెళ్లి చేయించాలని యువకుడి హల్‌చల్‌
Published Date :4/1/2019 7:07:21 AM
ప్రేయసితో పెళ్లి చేయించాలని యువకుడి హల్‌చల్‌

 తాను ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిపించాలని ఓ యువకుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. ఏకంగా స్తంభమెక్కి తన ప్రేయసితో తనకు పెళ్లి చేయించాలనే డిమాండ్‌ చేశాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌ గ్రామానికి చెందిన మాచగోని వీరేశం ముదిరాజ్‌ కుమారుడు మాచగోని సురేశ్‌ (26) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయితో తనకు వివాహం చేయించాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ స్థానిక చింతల్‌చెరువు సమీపంలోని విద్యుత్‌ హై టెన్షన్‌ స్తంభం ఎక్కి హల్‌చల్‌ చేశాడు. దీంతో స్థానికులు, వాహనదారులు ఆపి వివరాలు కనుక్కున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ సీఐ దేవేందర్‌తో పాటు పోలీసులు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడిని కిందకు శతవిధాల ప్రయత్నించారు. చివరకు అతడి కుటుంబసభ్యులను సంప్రదించి వారిని పిలిపించారు. కుటుంబసభ్యుల వినతి మేరకు ఆ యువకుడు కిందకు దిగివచ్చాడు. ఈ మేరకు ఆ యువకుడికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 
Related News Articles