Home >> News >> Latest News>> మహిళతో బస్సు డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

మహిళతో బస్సు డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన
Published Date :3/2/2019 11:15:39 AM
మహిళతో బస్సు డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

ఆర్‌టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు డ్రైవర్‌. ఈ సంఘటన శుక్రవారం రాత్రి విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పి లక్ష్మీ శిరీష అనే మహిళ అన్నవరం వద్ద విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఏపీ31 జెడ్‌ 452లో ఎక్కింది. కొద్దిసేపటి తర్వాత శిరీష తన బెర్త్‌లో నిద్రించిన సమయంలో బస్సు రెండో డ్రైవర్‌ గురుమార్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో ఆమె ఈ విషయాన్ని భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది. అనంతరం భర్త సలహా మేరకు బెంజిసర్కిల్‌ వద్ద బస్సును ఆపి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శిరీష ఫిర్యాదు మేరకు పటమటలంక పోలీసులు డ్రైవర్‌ గురుమార్తిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.




Related News Articles