Home >> News >> Latest News>> సీఎం ఇంట్లో బాంబు పెట్టామని ఫోన్‌

సీఎం ఇంట్లో బాంబు పెట్టామని ఫోన్‌
Published Date :12/19/2018 9:00:51 AM
సీఎం ఇంట్లో బాంబు పెట్టామని ఫోన్‌

ముఖ్యమంత్రి ఇంట్లో బాంబు పెట్టామని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు బెదిరింపు కాల్‌ చేసిన యువకుడిని జేపీ నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరప్పన అగ్రహార ప్రాంతానికి చెందిన మన్సూర్‌ సోమవారం రాత్రి కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి తన పేరు గోపాల్‌ అని జేపీ నగర్‌లో ఉన్న సీఎం కుమారస్వామి ఇంట్లో బాంబు పెట్టానని మరికొద్ది సేపట్లో బాంబు పేలనుందంటూ చెప్పి ఫోన్‌ పెట్టేసాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు భద్రత బలగాలు, బాంబు నిర్వీర్య దళం, శ్వానదళంతో అక్కడికి చేరుకొని అణువణువు క్షుణ్ణంగా గాలించగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఇది కేవలం బెదిరింపు కాల్‌గా నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం కంట్రోల్‌ రూమ్‌కు వచ్చిన నంబర్‌ ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేసిన జేపీ నగర్‌ పోలీసులు విచారణ జరపగా తన అసలు పేరు మన్సూర్‌ అని పోలీసులను తప్పుదారి పట్టించడానికి తన పేరు గోపాల్‌గా మార్చి చెప్పినట్లు అంగీకరించాడు. 
Related News Articles