Home >> News >> Latest News>> పోలీసుల అదుపులో కిరాతక కిల్లర్‌

పోలీసుల అదుపులో కిరాతక కిల్లర్‌
Published Date :11/21/2018 8:43:37 AM
పోలీసుల అదుపులో కిరాతక కిల్లర్‌

దొంగతనాలతో పాటు దారుణ హత్యలకు పాల్పడుతూ అంతుచిక్కకుండా తిరుగుతున్న ఓ కిరాతక కిల్లర్‌ను హర్యానా పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. 600 దొంగతనాలతో పాటు ఏడుగురిని అతికిరాతకంగా చంపిన నిందితుడు గత కొద్ది రోజులగా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని జగ్తార్‌ సిన్హాగా గుర్తించిన పోలీసులు మాటువేసి మంగళవారం అరెస్ట్‌ చేశారు.

అయితే నిందితుడు హత్య చేసే ముందు, తన పాపాలకు ప్రాయశ్చితంగా కాళీ మాత మంత్రాలతో 108 సార్లు జపం చేస్తాడని డీసీపీ లోకేంద్ర సిన్హా మీడియాకు తెలిపారు. జగ్తార్‌పై 7 హత్యా, 500 నుంచి 600 దొంగతనాల కేసులున్నాయన్నారు. నిందితుడు కూడా మీడియా ముందే తన నేరాలను ఒప్పుకున్నాడు. ఎవరినైనా చంపేముందు కాళీ మాత మంత్రాలను జపిస్తానని, ఈ పాపాల నుంచి రక్షించమని ఆ దేవత కోరుకుంటానన్నాడు. తను ఫరిదాబాద్‌, పల్వాల్‌, కురుక్షేత్ర, పంజాబ్‌ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినట్లు చెప్పుకొచ్చాడు. 
Related News Articles