Home >> News >> Nation>> సిట్‌ అధికారుల ఎదుట హాజరైన అక్షయ్‌

సిట్‌ అధికారుల ఎదుట హాజరైన అక్షయ్‌
Published Date :11/21/2018 8:36:16 AM
సిట్‌ అధికారుల ఎదుట హాజరైన అక్షయ్‌

డేరా చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీం సింగ్‌, మాజీ డిప్యూటీ సీఎం సుక్బీర్‌ సింగ్‌ బాదల్‌ల మధ్య రూ వంద కోట్ల ఒప్పందానికి సంబంధించి మధ్యవర్తిత్వం వహించారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) బుధవారం బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ను ప్రశ్నించనుంది. చండీగఢ్‌ చేరుకున్న అక్షయ్‌ సిట్‌ అధికారుల ఎదుట హాజరయ్యారు.  బాలీవుడ్‌ నటుడిని  ప్రశ్నించేందుకు సిట్‌ సమన్లు జారీ చేయగా, ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తానెన్నడూ గుర్మీత్‌ సింగ్‌ను కలవలేదని స్పష్టం చేశారు.

చండీగఢ్‌లో సిట్‌ అధికారుల ఎదుట హాజరవుతానని అక్షయ్‌ ట్వీట్‌ చేశారు. గుర్మీత్‌ నటించిన మెసెంజర్‌ ఆఫ్‌ గాడ్‌ (ఎంఎస్‌జీ) సినిమాను పంజాబ్‌లో విడుదలయ్యేలా సహకరించేందుకు గుర్మీత్‌ సింగ్‌, బాదల్‌ల మధ్య అక్షయ్‌ కుమార్‌ మధ్యవర్తిత్వం నెరిపారని ఆరోపణలు వచ్చాయి. అక్షయ్‌ నివాసంలోనే వీరిద్దరి భేటీ జరిగిందని చెబుతున్నారు. అయితే గుర్మీత్‌ను తానెప్పుడూ కలవనేలేదని బాదల్‌ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

కాగా, 2015లో ముంబైలోని అక్షయ్‌ ప్లాట్‌లో డేరా చీఫ్‌, సుక్బీర​ బాదల్‌లు సమావేశమయ్యారని పంజాబ్‌లో ఎంఎస్‌జీ మూవీ విడుదల కోసం ఈ సమావేశం జరిగిందని మాజీ ఎంపీ హరభన్స్‌ జలాల్‌ లేఖలో ఆరోపించారని రంజిత్‌ సింగ్‌ కమిషన్‌ నివేదిక పేర్కొంది.




Related News Articles