Home >> News >> FIR>> మహిళ పైశాచికం.. చెవి రింగుల కోసం

మహిళ పైశాచికం.. చెవి రింగుల కోసం
Published Date :11/17/2018 7:30:47 AM
మహిళ పైశాచికం.. చెవి రింగుల కోసం

మానవత్వం మరిచిన ఓ మహిళ.. నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా హింసించిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాలు.. రిజ్వానా బేగం అనే మహిళ నాలుగేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా కొడుతూ హింసించింది. నొప్పికి తాళలేక ఆ చిన్నారి కేకలు పెడుతున్నప్పటికి రిజ్వానా మనసు కరగలేదు. అంతటితో ఆగక చిన్నారి కేకలు బయటకు వినపడకుండా ఉండేందుకుగాను ఏకంగా ఆ చిన్నారిపై కూర్చుంది రిజ్వానా. ముంబై సబర్బన్‌ ట్రాంబే ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

రిజ్వానా బాలికను కొడుతున్న దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా ముంబై పోలీసులు రిజ్వానాను అరెస్ట్‌ చేశారు. బాలిక చెవి రింగులు దొంగతనం చేయడం కోసమే రిజ్వానా ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రిజ్వానా దగ్గర నుంచి బాలికకు చెందిన చెవి రింగులను స్వాధీనం చేసుకున్నారు.




Related News Articles