Home >> News >> Latest News>> మొబైల్‌ పోయిందని విద్యార్థిని ఆత్మహత్య

మొబైల్‌ పోయిందని విద్యార్థిని ఆత్మహత్య
Published Date :11/17/2018 7:27:58 AM
మొబైల్‌ పోయిందని విద్యార్థిని ఆత్మహత్య

సెల్‌ఫోన్‌ పోగొట్టుకోవడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం మైసూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని గాంధీనగర్‌కు చెందిన నిఖిత (16) గాయత్రిపురంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.  సోదరుడు బబ్లూతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం నిఖిత సెల్‌ఫోన్‌ కనిపించలేదు. నాన్న ఎంతో ప్రేమగా ఇచ్చిన ఫోన్‌ కనిపించకపోవడంతో నిఖిత గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎన్‌ఆర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Related News Articles