News
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి..ఇండియగ్యాస్ మోసం
సనత్ నగర్ లో దారుణం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చితకబాదిన దంపతులు
షామీర్పేట్ మండలం అలియాబాద్ సర్పంచ్ కుమార్ యాదవ్ పై అవినీతి ఆరోపణలు
పోలీసు స్టేషన్ పరిధిలోని హాఫిజ్ పెట్ వద్ద కారు భీభత్సం
ఫిర్యాదు చెయ్యడనికి వచ్చినా మహిళతో ఎస్సై వివాహేతర సంబంధం..
ఉగ్రవాది కరీం తుండా కేసులో తుది తీర్పు వచ్చేనెల 3 వతారుకు కు వాయిదా
బంజాాహిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మంత్రి కాన్వాయ్ రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్ జీ ఐ పోలిస్ స్టేషన్ కు చేరుకున్న ప్రముఖ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దిశ సినిమా తీసేందుకు ప్రయత్నం.
తెలంగాణ ముఖ్యమంత్రి KCR కు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్
హోమ్ మినిష్టర్ ,తెలంగాణ డీజీపీమహేంద్ర రెడ్డి
Home >> News >> Latest News>> సెక్స్‌ రాకెట్ గుట్టు రట్టు ‌: బాలీవుడ్‌ కొరియో గ్రాఫర్‌ అరెస్ట్‌

సెక్స్‌ రాకెట్ గుట్టు రట్టు ‌: బాలీవుడ్‌ కొరియో గ్రాఫర్‌ అరెస్ట్‌
Published Date :11/17/2018 7:25:23 AM
సెక్స్‌ రాకెట్ గుట్టు రట్టు ‌: బాలీవుడ్‌ కొరియో గ్రాఫర్‌ అరెస్ట్‌

ముంబై పోలీసులు అంతర్జాతీయ వ్యభిచార రాకెట్‌ను ఛేధించారు.  ఈ  కేసులో  బాలీవుడ్‌ కొరియో గ్రాఫర్‌ ఆగ్నేస్‌ హామిల్టన్‌ (56) పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైలోని లోఖండ వాలాలో డాన్స్‌ క్లాసులు నిర్వహించే ఆమె వ్యభిచారం నిమిత్తం విదేశాలకు  యువతులను తరలిస్తోందన్న ఆరోపణలపై ముంబై పోలీసులు అరెస్టు చేశారు.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం డాన్స్‌ అకాడమిని నిర్వహిస్తున్న ఆగ్నేస్‌  డ్యాన్స్‌ క్లాసులు పేరుతో అమ్మాయిలకు ఎరవేస్తుంది. ఆ తరువాత విదేశాల్లో, బార్లలో డాన్స్‌ చేస్తే ఎక్కువ డబ్బులొస్తాయంటూ మభ్యపెడుతుంది. అనంతరం వారిని వ్యభిచారంలోకి బలవంతంగా దించుతోంది. ఇలా కెన్యా, బహ్రెయిన్ దుబాయికి అమ్మాయిలను తరలిస్తుంది. ముఖ్యంగా  ఇలా ఒక యువతిని  తరలిస్తుండగా ఆమె  క్రైం బ్రాంచ్‌ పోలీసులను  ఆశ్రయించడంతో ఆమె బండారం బట్టబయలైంది.  కెన్యా హోటల్‌లో ఉద్యోగమంటూ సదరు యువతిని కెన్యాకు తరలించగా, అక్కడ రజియా పటేల్‌ అనే మరోవ్యక్తి (హామిల్టన్‌ ఏజంట్‌) ఆమెను నైరోబికి తీసుకెళ్లాడు.  అక్కడ వ్యభిచారం చేయాల్సిందిగా బలవంతం చేయడంతో ఆమె  పోలీసులకు సమాచారం అందించింది.  

యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను అరెస్ట్‌ చేశామని క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ దిలీప్ సావంత్ తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఇండియా మలేషియా మధ్య  చక్కర్లు కొడుతూ విదేశీ వ్యభిచార రాకెట్‌ను గతకొన్నేళ్లుగా నిర్వహిస్తోందని విచారణ అధికారి ఒకరు చెప్పారు. అంతేకాదు ఈ విషయాలను ఎవరికైనా చెబితే మత్తుమందుల కేసులో ఇరికిస్తానని కూడా బెదిరిస్తుందట. ఇలా విదేశాలకు పంపిన ప్రతి యువతికి 40వేల రూపాయలు  తీసుకుంటుందట.
Related News Articles