Home >> News >> Latest News>> అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి

అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి
Published Date :11/9/2018 12:22:21 PM
అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి

మెరికాలోని మిన్నెయాపోలిస్‌ నగరంలో అక్కడి కాలమానం ప్రకారం నవంబర్‌ 7న భార్గవ్‌ రెడ్డి ఇత్తిరెడ్డి(25) అనే తెలుగు విద్యార్థి ఆకస్మికంగా మృతిచెందాడు. గుండెపోటు రావడంతో తోటి స్నేహితులు దగ్గరలోని మెడికల్‌ సెంటర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. ఇత్తిరెడ్డి భార్గవ్‌ రెడ్డి స్వస్థలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లా. నార్త్‌ టెక్సాస్‌ యూనివర్సిటీలో భార్గవ్‌ ఇటీవలే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు.

ఉద్యోగం వెతుక్కునేందుకు టెక్సాస్‌ నుంచి మిన్నెయాపోలిస్‌ నగరానికి ఇటీవల మారాడు. చిన్నవయసులోనే మృతిచెందడం విషాదకరమని తోటి స్నేహితులు తెలిపారు. ఎప్పుడూ ఇతరులకు సహాయపడే మనస్తత్వం భార్గవ్‌దని స్నేహితులు తెలిపారు. భార్గవ్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భార్గవ్‌ రెడ్డి మృతి విషయం తెలిసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Related News Articles