Home >> News >> FIR>> టీడీపీ ఎంపీ గన్‌మెన్‌ భార్య ఆత్మహత్య

టీడీపీ ఎంపీ గన్‌మెన్‌ భార్య ఆత్మహత్య
Published Date :10/11/2018 9:58:38 AM
టీడీపీ ఎంపీ గన్‌మెన్‌ భార్య ఆత్మహత్య

చిత్తూరు టీడీపీ ఎంపీ ఎన్‌. శివప్రసాద్‌ గన్‌మెన్‌ వెంకటరమణ భార్య సరస్వతి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం బాలాజీనగర్‌లోని ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

గతంలో కూడా వెంకటరమణ తన భార్య సరస్వతిని సర్వీస్‌ గన్‌తో చంపుతానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై మదనపల్లె తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో కూడా కేసు పెండింగ్‌లో ఉంది. ఆత్మహత్య విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Related News Articles