Home >> News >> Latest News>> భర్తపై వేడి నూనె పోసిన భార్య

భర్తపై వేడి నూనె పోసిన భార్య
Published Date :10/8/2018 8:48:22 AM
భర్తపై వేడి నూనె పోసిన భార్య

కుటుంబ సమస్యల కారణంగా ఓ మహిళ తన భర్తపై వేడి నూనె పోసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నారాయణ్‌ సింగ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భాగ్‌ అమీర్‌లో కుమార్‌ చౌదరి, ప్రేమ్‌దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. జ్యువెలరీ వ్యాపారం చేసే కుమార్‌ చౌదరి వ్యాపారంలో నష్టాలు రావటంతో అప్పులపాలయ్యాడు. దీంతో భార్యాబిడ్డల పోషణ భారంగా మారటంతో పిల్లలను తీసుకుని స్వగ్రామంలోని తన తల్లి వద్దకు వెళ్లాలని భార్యకు సూచించాడు. ఇందుకు ప్రేమ్‌దేవి నిరాకరించటంతో గత నెల రోజులుగా ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కుమార్‌ చౌదరి ఇంట్లో నిద్రిస్తుండగా ప్రేమ్‌ దేవి అతడిపై వేడిగా ఉన్న వంటనూనె పోయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.  
Related News Articles