Home >> News >> FIR>> ఇంటర్‌ విద్యార్థిని కిడ్నాప్‌ చేసిన నక్సల్స్‌

ఇంటర్‌ విద్యార్థిని కిడ్నాప్‌ చేసిన నక్సల్స్‌
Published Date :10/5/2018 9:01:04 AM
ఇంటర్‌ విద్యార్థిని కిడ్నాప్‌ చేసిన నక్సల్స్‌

ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో యువకుడి కిడ్నాప్‌ కలకలం రేపింది. ఇంటర్‌ రెండో సవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని నక్సలైట్లు బుధవారం కిడ్నాప్‌ చేశారు. బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు నక్సలైట్లను కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే యువకున్ని అపహరించినట్టు తెలుస్తోంది. బేజీ నుంచి కొండకు వెళ్తున్నతక కొడుకు కనిపించకుండా పోయాడని యువకుడి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారుప. 

కాగా, నిన్న ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశ నుంచి నక్సలైట్ల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నామనీ, మరో నక్సలైట్‌ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. భద్రతా బలగాలు చేపట్టిన యాంటి నక్సల్‌ ఆపరేషన్‌ సందర్భంగా ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు సుకుమా ఎస్పీ అభిషేక్‌ మీనా తెలిపారు. ఘటనా స్థలం నుంచి నాలుగు నాటు బాంబులు, ఒక రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
Related News Articles