Home >> News >> Latest News>> తాగుబోతులకూ ఓ సంఘం...కష్టాలు ఇవే అంటూ వీడియో వైరల్

తాగుబోతులకూ ఓ సంఘం...కష్టాలు ఇవే అంటూ వీడియో వైరల్
Published Date :9/14/2018 9:03:09 AM
తాగుబోతులకూ ఓ సంఘం...కష్టాలు ఇవే అంటూ వీడియో వైరల్

 ఉద్యోగులకు సంఘాలు చూశాం. కార్మికులందరూ కమిటీలుగా ఏర్పడటం విన్నాం. ఇప్పుడు తాగుబోతులు కూడా ఏకమయ్యారా?.. హక్కుల కోసం పోరాడుతున్నారా?.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియోహక్కుల కోసం పోరాడేవారు ఒక్కటవడం చూశాం.. అన్యాయం జరిగిందంటూ న్యాయం కోసం పోరాడుతూ సంఘాలుగా ఏర్పడే వాళ్ల గురించి విన్నాం. చివరకు భార్యా బాధితులు కూడా ఉంటారని, వాళ్లకూ ఓ సంస్థ, సంఘం ఉంటాయని సోషల్ మీడియాలో జోకులు వేసుకున్నాం. కానీ ఓ వ్యక్తి తెలంగాణ తాగుబోతుల సంఘం పేరుతో కమిటీని ఏర్పాటు చేసి వాళ్ల బాధలను ఏకరవుపెట్టాడు. అదేదో హక్కుల కోసం పోరాడుతన్నామన్న రేంజ్‌లో ఇవీ మా కష్టాలంటూ ఏకరవు పెడుతున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవ్వుకుంటూ కొందరు...నవ్వుతూ తిట్టుకుంటూ ఇంకొందరు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.

 
బాటిల్‌కు ఎంత ఎక్కువ ధర చెప్పినా ఎప్పుడూ అడగలేదని, ప్రభుత్వం తమ వల్లే నడుస్తోందంటూ ఆ వీడియోలో మందుబాబు...అదేదో సినిమాలో సునీల్ రేంజ్‌లో లెక్కలు చెబుతున్నాడు. తాగమని పర్మిట్ రూంలు ఏర్పాటు చేసి, బయటకు రాగానే డ్రంక్‌ అండ్ డ్రైవ్ అంటూ డబ్బులు లాగేయడం ఏంటి అంటూ తెగ హడావుడి చేస్తున్నాడు.
 
మద్యం మత్తులో ప్రమాదాలు జరుగకూడదంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టింది. అయితే ఆ విషయం ఈ మందుబాబుకు కొంచెం కొత్తగా అర్ధమైంది. కొత్తగా ఏంటి చెత్తగా అనేవాళ్లు కూడా ఉన్నారనుకోండి. అయితే ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
source:- http://www.andhrajyothy.com



Related News Articles