Home >> News >> Latest News>> ప్రియురాలిపై అత్యాచారం జరిగిందని...ప్రియుడి ఆత్మహత్య

ప్రియురాలిపై అత్యాచారం జరిగిందని...ప్రియుడి ఆత్మహత్య
Published Date :9/14/2018 8:34:33 AM
ప్రియురాలిపై అత్యాచారం జరిగిందని...ప్రియుడి ఆత్మహత్య

తన ప్రియురాలిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారనే ఆవేదనతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో వెలుగుచూసింది. శావన్ సాయి అనే 19 ఏళ్ల బాలుడు ఓ బాలికను ప్రేమిస్తున్నాడు. ప్రియురాలితో కలిసి శావన్ సాయి తిరుగుతుండగా ఈశ్వర్ దాస్, ఖేమ్ లనే మరో ఇద్దరు యువకులు చూసి సాయిని కొట్టారు. దీంతో సాయి స్పృహ కోల్పోవడంతో అతని ప్రియురాలైన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటన అనంతరం తన గాళ్ ఫ్రెండ్‌పై సామూహిక అత్యాచారం చేశారనే ఆవేదనతో మూడు రోజులకు శావన్ సాయి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి ఆత్మహత్యతో బాలిక నేరుగా పోలీసుస్టేషనుకు వచ్చి అత్యాచారం, ప్రియుడి ఆత్మహత్యల గురించి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.




Related News Articles