Home >> News >> Films>> జీవితాంతం చెప్పుకునే సినిమా

జీవితాంతం చెప్పుకునే సినిమా
Published Date :9/1/2018 11:42:51 AM
జీవితాంతం చెప్పుకునే సినిమా

కష్టం అంటే ఏమిటో తెలియకుండా నా తమ్ముడు పెరిగాడు. వాడితో సినిమాలు చేయమని నేను ఎవరిని అడగలేదు. జీవితంలో నేను ఎంత కష్టపడి పైకి వచ్చానో అలాగే పేరుతెచ్చుకోమని వాడితో చెప్పాను. ఖయ్యూమ్ చాలా కష్టపడి చేసిన సినిమా ఇది అని అన్నారు హాస్యనటుడు అలీ. ఖయ్యూమ్, తనిష్క్ రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం దేశంలో దొంగలు పడ్డారు. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకుడు. రమాగౌతమ్ నిర్మాత. ఈ చిత్రానికి అలీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ఎవరి దగ్గర పనిచేయకుండా సినిమాల చూసిన జ్ఞానంతో గౌతమ్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. ఓ ముప్ఫై ఏళ్లు వెనక్కి వెళ్లి రామ్‌గోపాల్‌వర్మ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఆ అనూభూతిని పంచింది. కథలోని మలుపులు బాగున్నాయి. నా తమ్ముడి సినిమా అని కాకుండా కథ నచ్చి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాను అని తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. నటుడిగా నా కలల చిత్రమిది. జీవితాంతం చెప్పుకునే మంచి సినిమా అవుతుంది. మంచి సినిమా చేశావని అన్నయ్య ప్రశంసలు అందుకోవడం ఆనందంగాఉంది అని ఖయ్యూమ్ తెలిపారు.




Related News Articles