Home >> News >> Latest News>> తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు ఉండవు

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు ఉండవు
Published Date :8/31/2018 3:01:35 PM
తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు ఉండవు
చీఫ్ ఎలక్షన్ కమిషన్ రావత్ తో కలిశాను. గంటకుపైగా చర్చించాం. 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు.
అసెంబ్లీని రద్దుచేస్తారన్న వార్తలు వస్తున్నాయి.  రాజీవ్ శర్మ ఎన్నికల సంఘం అధికారులను కలిశారు.
ముందస్తు ఎన్నికలకు ఎన్నికల సంఘం సుముఖంగా లేదు. డిసెంబర్ లో కచ్చితంగా తెలంగాణలో ఎన్నికలు జరగవు
 తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఈసారి కచ్చితంగా  వీవీప్యాట్ లు పెట్టి తీరాలి. వీవీప్యాట్ లను ఆపరేట్ చేసే సిబ్బందికి ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు.
ఇదే విషయాన్ని రాజీవ్ శర్మకు ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు. 
రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించి ఏడు మండలాలను ఏపీకిచ్చారు. దీన్ని రావత్ దృష్టికి తీసుకొచ్చాను.
2026 వరకు నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదు. మరి ఆ ఏడు మండలాల సంగతేంటి. ?
వాటికి ప్రతినిధి ఉండరా?... రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినట్లకాదా?
ఆర్టికల్ 170ని మార్చకుండా నియోజకవర్గాల సరిహద్దులుగానీ, పెంచడంగానీ చేయలేరు.
హోం మంత్రి నోటిఫికేషన్ సరిపోదు... రాజ్యాంగాన్ని సవరించాలి. లేకపోతే న్యాయపరమైన చిక్కులు తప్పవు.
అసెంబ్లీని తొందరపడి రద్దుచేస్తే ఎన్నికల సంఘం జఠిలమైన సమస్యలు ఎదుర్కోవాల్సివస్తుంది
ముందస్తు ఎన్నికలు పెట్టడం వెనుక కుట్ర ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అర్హులైనవారిని ఓటర్ల జాబితానుంచి తొలగించారు.
ఇప్పుడే కేసీఆర్ అదే పనిచేస్తున్నారు. ఎన్ని అక్రమాలు చేసినా ఫర్వాలేదు  ... గెలిస్తే చాలనుకుంటున్నారు కేసీఆర్.
అసెంబ్లీని రద్దుచేసినా డిసెంబర్ లో ఎన్నికలు జరగవు.  ఆర్నెళ్ల సమయం ఉంటుంది. 
మేం సీఈసీకి ఇచ్చిన రిప్రజెంటేషన్ ను... తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకు, రాజీవ్ శర్మకు పంపిస్తాం.
అప్పటికీ కాదని ముందుకెళ్తే న్యాయపోరాటం తప్పదు. 



Related News Articles