Home >> News >> Latest News>> కన్ను కొడితే కేసు పెడతారా..?

కన్ను కొడితే కేసు పెడతారా..?
Published Date :8/31/2018 10:37:46 AM
కన్ను కొడితే కేసు పెడతారా..?

ప్రముఖ మళయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ‘ఓరు ఆదార్ లవ్’ సినిమా విడుదలకు ఆటంకాలు తొలగిపోయాయి.  ఈ సినిమాలోని పాటలు ముస్లీం మనోబావాలను కించపరిచేలా ఉన్నాయంటూ కొందరు ముస్లీంలు కోర్టుకెక్కారు.  ఈ చిత్రంలోని ‘మాణిక్య మలరయ’ పాట ముస్లీంల సంప్రదాయ గీతం అని, ఈ గీతంలో ప్రయా వారియర్ కన్నుకొట్టడం అసభ్యంగా ఉందని ముస్లీంలు గతంలో ఆగ్రహాం వ్యక్తం చేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  సుప్రీంకోర్టులో కేసు కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.  ఈ పిటీషన్ ను పరిశీలించిన సుప్రీం ప్రదాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, పిటీషనర్లపై ఆగ్రహాం వ్యక్తం చేశారు.  ఎవరో ఏదో సినిమాలో పాట పాడితే మీకు కేసులు వేయడం తప్ప మరోపనిలేదా అని పిటీషనర్లను మందలించి కేసును కొట్టివేశారు.  సుప్రీం తీర్పుతో ఈ సినిమా విడుదలకు ఆటంకాలు తొలగినట్లయింది.  త్వరలో ఈ సినిమా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.




Related News Articles