Home >> News >> Latest News>> అశ్లీల దృశ్యాలు చూడాలని విద్యార్థినులకు వేధింపులు

అశ్లీల దృశ్యాలు చూడాలని విద్యార్థినులకు వేధింపులు
Published Date :7/10/2018 10:07:53 AM
అశ్లీల దృశ్యాలు చూడాలని విద్యార్థినులకు వేధింపులు

ద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే.. కీచకులుగా మారారు. అశ్లీల దృశ్యాలు చూడాలని విద్యార్థినులను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు వేధింపులకు గురి చేశారు. ఈ సంఘటన బీహార్ లాల్‌బాగ్ ఏరియాలోని పబ్లిక్ పాఠశాలలో వెలుగు చూసింది. గత కొద్ది రోజుల నుంచి ప్రిన్సిపాల్, ఇతర ఉపాధ్యాయులు కలిసి.. విద్యార్థినులకు బలవంతంగా అశ్లీల దృశ్యాలు చూపిస్తున్నారు. ఆ తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. టీచర్ల వేధింపులు భరించలేని కొంతమంది విద్యార్థినులు.. నోరు విప్పారు. నిత్యం ప్రిన్సిపాల్, టీచర్లు వేధిస్తున్న విషయాన్ని తమ తల్లిదండ్రుల దృష్టికి విద్యార్థినులు తీసుకువచ్చారు. దీంతో బాధిత విద్యార్థినులు, తల్లిదండ్రులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంబంధిత పాఠశాలను సీజ్ చేశారు. అయితే కేసు పెట్టే కంటే ముందే.. బాధిత విద్యార్థినులకు ప్రిన్సిపాల్ డబ్బు ఆశ చూపించాడు. ప్రిన్సిపాల్, ఇతర ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.




Related News Articles