Home >> News >> Latest News>> చిన్నారిని ఆటోకేసి కొట్టిన తండ్రి -

చిన్నారిని ఆటోకేసి కొట్టిన తండ్రి -
Published Date :7/10/2018 10:05:27 AM
చిన్నారిని ఆటోకేసి కొట్టిన తండ్రి -

తాగిన మత్తులో ఓ తండ్రి ఉన్మాదిగా మారాడు. కన్న కొడుకునే ఆటోకేసి కొట్టాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. భార్యాతో మొదలైన గొడవ.. మూడేళ్ల కొడుకు ప్రాణాలమీదకొచ్చింది. భార్యా, పోలీసులు వద్దని వారిస్తున్నా.. కసితీరా చిన్నారిని ఆటోకేసి కొట్టాడు. పైశాచికంగా ప్రవర్తించాడు. ఆటోకేసి కొట్ట‌డంతో చిన్నారి కింద ప‌డిపోయాడు. మ‌ళ్లీ ఆ పిల్ల‌వాడిని ఎత్తుకుని ఏడుస్తూ, ఆరుస్తూ మెంట‌ల్ మెంట‌ల్‌గా వ్య‌వ‌హ‌రించాడు. బాబును ఏమీ చేయ‌వ‌ద్దు అని భార్యా వేడుకుంటున్నా.. గ‌ట్టిగా చిన్నారిని ప‌ట్టుకుని తండ్రి వింత వింత‌గా ప్ర‌వ‌ర్తించాడు. తీవ్రంగా గాయపడ్డ బాబుకు హాస్పటల్‌లో చికిత్స చేయిస్తున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చిన్నారిని అప్పగించారు. ఐపీసీలోని 324, జువనైల్ జస్టిస్‌లోని 75వ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోమవారం జరిగింది. చిన్నారిని ఆటోకేసి కొట్టిన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఘటనకు చెందిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.a




Related News Articles