Home >> News >> Latest News>> ప్రేమికుల పెళ్లికి పోలీసుల పౌరోహిత్యం

ప్రేమికుల పెళ్లికి పోలీసుల పౌరోహిత్యం
Published Date :7/10/2018 9:55:24 AM
ప్రేమికుల పెళ్లికి పోలీసుల పౌరోహిత్యం

పెద్దలు వ్యతిరేకించి అడ్డుకున్న పెళ్లిని పోలీసులు జోక్యం చేసుకుని జరిపించిన సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. బెంగళూరు దక్షిణ జిల్లా పరప్పన అగ్రహార కొత్తరోడ్డులో నివసిస్తున్న కృష్ణమూర్తి అనే యువకుడు అదే గ్రామానికి సంధ్య అనే అమ్మాయిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. వీరి వివాహానికి అమ్మాయి తరపు పెద్దలు ఒప్పుకున్నా, కృష్ణమూర్తి తరఫు పెద్దలు నిరాకరించారు. దీంతో అమ్మాయి సంధ్య తరఫు పెద్దలే వివాహ ఏర్పాట్లు చేసి ఇదేనెల 8, 9తేదీల్లో టీ.బేగూరులోని విరాట భవనంలో వివాహం జరిపించడానికి సన్నాహాలు చేశారు.

అయితే ఆదివారం అక్కడకు వచ్చిన కృష్ణమూర్తి తరఫు పెద్దలు తమ అబ్బాయికి ఇంకా పెళ్లి వయసు రాలేదని, మైనర్‌ అని వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న నెలమంగల గ్రామీణ పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి ఇరువైపులవారినీ శాంతింపజేసారు. అమ్మాయి, అబ్బాయిల దాఖలు పత్రాలను పరిశీలించి ఇద్దరూ మేజర్లుగా దృవీకరించారు. దీంతో పోలీసులే ముందుండి వివాహం జరిపించారు.




Related News Articles