Home >> News >> FIR>> వివాహిత ప్రాణం తీసిన కుటుంబ కలహాలు

వివాహిత ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
Published Date :5/30/2018 10:09:30 AM
వివాహిత ప్రాణం తీసిన కుటుంబ కలహాలు

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకాలోని కప్పల మడుగు గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దివ్య(24)కు పొరుగు గ్రామమైన యలువనహళ్లికి చెందిన రామచంద్ర అనే యువకుడితో వివాహమైంది. అయితే దివ్య కప్పలమడుగులోనే ఉంటోంది. ఈక్రమంలో దివ్య, ఆమె పిన్ని రాధమ్మలు బంగారు ఆభరణాలు, నగదు వ్యవహారంపై గొడవ పడ్డారు. రాధమ్మ బంగారు ఆభరణాలు, నగదు తీసుకెళ్లిందని మనస్థాపానికి గురైన దివ్య.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి అనంతరం తన ఇంట్లో  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.   పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Related News Articles