Home >> News >> Latest News>> బాలికపై ముగ్గురు మృగాళ్ల కీచక దాడి

బాలికపై ముగ్గురు మృగాళ్ల కీచక దాడి
Published Date :5/11/2018 8:53:57 AM
బాలికపై ముగ్గురు మృగాళ్ల కీచక దాడి

ముగ్గురు మృగాళ్లు  బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన దామరచర్ల మండలకేంద్రంలో గత నెలలో జరగగా, గురువారం వెలుగులోకి వచ్చింది. వాడపల్లి ఎస్‌ఐ యు.నగేష్‌ తెలిపిన వివరాల ప్రకారం...  మండల కేంద్రానికి చెందిన బాలిక (14) గత నెల29న పనిపై బయటికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా అదేకాలనీకి చెందిన తాపీమేస్త్రీ షేక్‌ భాషా (22) ముందస్తు ప్రణాళికతో అటకాయించాడు.

తన బైక్‌పై ఎక్కమని ఇంటివద్ద దింపుతానని నమ్మ బలికాడు. దీంతో బాలిక బైక్‌ ఎక్కింది. అనంతరం కాలనీ చివరన నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే అతని మిత్రులు మరో తాపీమేస్త్రీ షేక్‌ అల్లా బక్షి (22), లారీ క్లీనర్‌  చిన్నబోతుల  రవి(21)లు అక్కడే కాపు గాసి ఉన్నారు. అనంతరం బాలికను బలవంతంగా ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడి చేశారు. జరిగిన విషయం తల్లిదండ్రులకు చెబితే చంపేస్తామని  బెదిరించారు.

దీంతో ఆ బాలిక తనలోనే కుమిలిపోయి  ఘటన జరిగినప్పటి నుంచి మౌనంగా ఉంటోంది. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి బాలికను అడగగా జరిగిన విషయం తెలిపి బోరున విలపించింది. తల్లి ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా బాలిక ఇటీవల  స్థానికంగా 5వ తరగతి పూర్తి చేసుకుంది. 
Related News Articles