Home >> News >> True Crime Stories>> మత్తు మందు చల్లి ప్రొద్దుటూరులో చోరీ

మత్తు మందు చల్లి ప్రొద్దుటూరులో చోరీ
Published Date :5/4/2018 1:54:18 PM
మత్తు మందు చల్లి ప్రొద్దుటూరులో చోరీ

స్థానిక మైదుకూరు రోడ్డులోని బాలాజీనగర్‌–2లో నివాసం ఉంటున్న కాఫీడే డిస్ట్రిబ్యూటర్‌ ప్రదీప్‌రెడ్డి ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. నిద్రపోతున్న వ్యక్తిపై మత్తు మందు చల్లి అతని వద్ద ఉన్న తాళం చెవి తీసుకొని ఇంట్లోకి చొరబడ్డారు. టూ టౌన్‌ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రదీప్‌రెడ్డి కాఫీడే డిస్ట్రిబ్యూటర్‌గా పని చేస్తున్నాడు. అతను రెండు రోజుల క్రితం ఏజెన్సీ పనిపై క్యాంప్‌నకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన తండ్రి నరసింహారెడ్డి ప్రధాన ద్వారానికి తాళం వేసి మంగళవారం మిద్దెపై పడుకున్నారు. ప్రదీప్‌రెడ్డి భార్య శశికళ, కుమార్తె అనితశ్రీలు ఇంట్లోని రెండో బెడ్‌రూంలో పడుకున్నారు. ఈ క్రమంలో మిద్దెపై పడుకున్న నరసింహారెడ్డి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నిద్రలేచి చూడగా దిండు కింద తాళాలు, సెల్‌ఫోను ఉన్నాయి.

 Related News Articles