Home >> News >> FIR>> ‘బాల్యవివాహం చేస్తే పూజారిపై కేసు’

‘బాల్యవివాహం చేస్తే పూజారిపై కేసు’
Published Date :4/27/2018 10:27:48 AM
‘బాల్యవివాహం చేస్తే పూజారిపై కేసు’

అవగాహన రాహిత్యంతో నారాయణపేట డివిజన్‌లో ఎక్కువగా బాల్యవివాహాలు చేçయడానికి సిద్ధమవుతున్నారని, వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలేస్తే రహస్యంగా తిరిగి పెళ్లిళ్లు చేసినట్లు సమాచారం వస్తుందని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. గురువారం పేటలో పలు కార్యక్రమాలకు హాజరైన ఆయన బాల్యవివాహాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేసులు నమోదు చేస్తేనే మార్పు కనిపిస్తుందని ముందు పెళ్లి చేసిన పూజారిపై కేసు నమోదు చేయాలన్నారు.

ఇటీవల దామరగిద్ద మండలం కంసాన్‌పల్లికి చెందిన అమ్మాయిని మద్దూరు మండలంలోని ఓ అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారని, కౌన్సిలింగ్‌ ఇచ్చినా తిరిగి పెళ్లి చేయడంపై సీరియస్‌ అయ్యారు. వెంటనే ఇరువురి కుటుంబ సభ్యులు, పెళ్లికి హాజరైన అందరిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అంతకు ముందు భూమిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బాల్యవివాహాలపై మాట్లాడారు.

 



Related News Articles