Home >> News >> Top Stories>> స్నేహితుడి కొడుకునే కిడ్నాప్‌ చేసి.. కిరాతకం!

స్నేహితుడి కొడుకునే కిడ్నాప్‌ చేసి.. కిరాతకం!
Published Date :3/9/2018 10:18:35 AM
స్నేహితుడి కొడుకునే కిడ్నాప్‌ చేసి.. కిరాతకం!

డబ్బు కోసం స్నేహితుడి కొడుకుని కిడ్నాప్‌ చేసి హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గౌతమ్(9) అనే బాలుడిని అతని తండ్రి స్నేహితులు సాయి, మల్లిలు డబ్బు కోసం కిడ్నాప్ చేసి.. ఆ తర్వాత భయంతో చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని బి.యాలేరు చెరువులో పడేశారు. పోలీసులు ఎట్టకేలకు నిందితులు సాయి, మల్లిలను అరెస్టు చేశారు. బాలుడి హత్యతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ​కు న్యాయం జరిగేలా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గౌతమ్‌ తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.




Related News Articles