Home >> News >> Films>> దీపికకి ప‌ట్టుచీర గిఫ్ట్‌గా ఇచ్చిన స్టార్ హీరోయిన్

దీపికకి ప‌ట్టుచీర గిఫ్ట్‌గా ఇచ్చిన స్టార్ హీరోయిన్
Published Date :2/9/2018 12:48:02 PM
దీపికకి ప‌ట్టుచీర గిఫ్ట్‌గా ఇచ్చిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ దీపిక ప‌దుకొణే తాజా చిత్రం ప‌ద్మావ‌త్‌. ఎన్నో వివాదాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ళు రాబ‌డుతుంది. తొలుత ఈ సినిమాని విడుద‌ల చేయ‌మ‌న్న క‌ర్ణిసేన‌, రాజ్‌పుత్‌లు మూవీ రిలీజ్ త‌ర్వాత‌ ప్ర‌శంస‌లు కురిపించారు. ఎన్నో ట్విస్ట్‌ల మ‌ధ్య ప‌ద్మావ‌త్ చిత్రం థియేట‌ర్స్‌లోకి వ‌చ్చి అందరి ప్ర‌శంస‌లు అందుకుంటుంది. సినిమా రిలీజ్‌కి ముందు ప‌ద్మావ‌త్ చిత్రంలో రాణి ప‌ద్మావ‌తి పాత్ర పోషించిన దీపికకి ఎన్నో బెదిరింపులు వ‌చ్చాయి. ముక్కు కోస్తామ‌ని, దీపిక‌ త‌ల తెస్తే కొంత పారితోషికం ఇస్తామ‌ని ఇలా ప‌లు ర‌కాలుగా బెదిరించారు. కాని అన్నింటిని త‌ట్టుకొని చాలా ధైర్యంగా నిలబ‌డింది దీపికా ప‌దుకొణే. ప‌ద్మావ‌త్ చిత్రంలో దీపిక న‌ట‌న‌పై ప‌లువురు స్టార్స్ ప్రశంస‌లు కురిపిస్తున్నారు. కొంద‌రు గిఫ్ట్స్ పంపి మ‌రి దీపికని అభినందిస్తున్నారు. మొన్నామ‌ధ్య బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ లేఖ‌తో పాటు పూల‌గుత్తిని పంపించి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. తాజాగా అల‌నాటి అందాల తార రేఖ‌.. దీపికకి ప‌ట్టుచీర‌ని పార్శిల్ ద్వారా పంపింది. దీనిని వెంట‌నే త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఎవ‌రు పంపారో క‌నుక్కోండి అని అభిమానుల‌కి ప‌జిల్ పెట్టింది దీపిక‌. గ‌తంలో ‘బాజీరావ్‌ మస్తానీ’ చిత్రాన్ని చూసి వచ్చాక కూడా రేఖ ఇలాగే దీపికకు పట్టుచీర పెట్టారు. 




Related News Articles