Home >> News >> Films>> మ‌రో సంచ‌లనానికి తెర‌లేప‌నున్న వ‌ర్మ‌

మ‌రో సంచ‌లనానికి తెర‌లేప‌నున్న వ‌ర్మ‌
Published Date :2/9/2018 12:46:01 PM
మ‌రో సంచ‌లనానికి తెర‌లేప‌నున్న వ‌ర్మ‌

వెండితెర‌పై సాధ్యం కానిది డిజిట‌ల్ మీడియా ద్వారా చేసి సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాడు కాంట్రవ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. క‌డ‌ప అంటూ ఓ వెబ్ సిరీస్ మొద‌లు పెట్టిన వ‌ర్మ ఆ త‌ర్వాత జీఎస్టీ తీశాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో వ‌ర్మ తీసిన ఈ వెబ్ సిరీస్ ప‌లు వివాదాలు సృష్టిచింది. మ‌హిళా లోకం దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జీఎస్టీ వెబ్‌ సిరీస్‌ వివాదంపై నమోదైన కేసులో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు సీసీఎస్‌ అధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. వ‌చ్చే వారం మ‌రోసారి నోటీసులు పంపితే విచార‌ణకి వ‌స్తాన‌ని వ‌ర్మ అన్నాడు. జీఎస్టీ ఉదంతం నుండే జనం ఇంకా బయటకు రాకముందే మరో పోస్టర్ తో షాక్ ఇచ్చాడు వర్మ. ద వయోరిజం ఆఫ్ రామూయిజం అంటూ ఇద్దరు మహిళలు నగ్నంగా ఉన్న కాళ్లతో కూడిన పోస్టర్‌ని తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట‌ర్ అందరికి షాకింగ్‌గా మారింది. ఇతరులు లైంగిక కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు లేదా నగ్నంగా ఉన్నప్పుడు చూడటం ద్వారా ఆనందం పొందటమే వయోరిజం. మ‌రి వ‌ర్మ వయోరిజం వెబ్ సెరీస్ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఇది ఇంకెన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి. సంచ‌లన ద‌ర్శ‌కుడు వ‌ర్మ మ‌రోవైపు కింగ్ నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లో కామ్ డ్రామా చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.




Related News Articles