Home >> News >> World>> ఆత్మాహుతి దాడుల్లో 16మంది మృతి

ఆత్మాహుతి దాడుల్లో 16మంది మృతి
Published Date :1/16/2018 9:11:56 AM
ఆత్మాహుతి దాడుల్లో 16మంది మృతి

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో సోమవారం ఉదయం జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో సుమారు 16మంది దుర్మరణం చెందగా, వందలాదిమంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. బాగ్దాద్‌లోని రద్దీగా ఉండే టెరాన్ స్క్వేర్ సమీపంలోజంట పేలుళ్లు సంభవించినట్లు ఆర్మీ అధికారి వెల్లడించారు. అయితే ఈ పేలుళ్లకు పాల్పడింది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థగా అనుమానిస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Related News Articles