Home >> News >> Top Stories>> అన్నా.. అమ్మను తిట్టకురా..

అన్నా.. అమ్మను తిట్టకురా..
Published Date :12/9/2017 6:49:42 AM
అన్నా.. అమ్మను తిట్టకురా..

 అన్నా.. అమ్మ ను తిట్టకురా.. అమ్మ ఏం దాసుకోలేదురా..ఆస్తి మొత్తం నువ్వే తీసుకో.. నువ్వు కూడా జాగ్రత్త.. నేను చనిపోతున్నాను..అమ్మకు చెప్పకు..’ అని డెత్‌నోట్‌ రాసి ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ కరీమాబాద్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన జంగం పూర్ణచందర్‌(25) హన్మకొండలోని ఓ ప్రవేట్‌ కళాశాలలో బీఎస్సీ చదివి ఫెయిలయ్యాడు. విజయవాడలోని ఓ ప్రైవేట్‌ సెల్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నా డు.

ఈ క్రమంలో బుధవారం ఇంటికి వచ్చిన పూర్ణచందర్‌ రాత్రి తల్లి లక్ష్మికి చెప్పి బయటికి వెళ్లాడు. గురువారం ఉదయం హంటర్‌రోడ్డు మినీబ్రిడ్జి సమీ పంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ తెలిపారు.  డెత్‌ నోట్‌ రాసుకుని పూర్ణచందర్‌ ఆత్మహత్య చేçసుకున్న ట్లు సీఐ చెప్పారు. పూర్ణచందర్‌ ఆత్మ హత్యతో తల్లి లక్ష్మి రోదనలు మిన్నంటా యి. డబ్బుల విషయమై మృతుడి అన్న వెంకటేష్‌ మందలించడంతోనే పూర్ణచందర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యలు ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Related News Articles