Home >> News >> World>> యువరాజులు, ట్విట్టర్, యాపిల్ ఇన్వెస్టర్ల అరెస్ట్

యువరాజులు, ట్విట్టర్, యాపిల్ ఇన్వెస్టర్ల అరెస్ట్
Published Date :11/15/2017 8:29:13 AM
యువరాజులు, ట్విట్టర్, యాపిల్ ఇన్వెస్టర్ల అరెస్ట్

అవినీతి నిర్మూలన చర్యల్లో భాగంగా ఇప్పటివరకు 200 మందికి పైగా నిందితులను అదుపులోకి చేశారు. అవినీతి చేపల ఏరివేత కోసం సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఇటీవల 30 మంది జడ్జీలను నియమించడంతో పాటు 26 మంది జడ్జీలను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. గత వారం రోజుల నుంచి కింగ్ సల్మాన్ ఆదేశాలతో అవినీతి కేసులో 11 మంది యువరాజులను, నలుగురు మంత్రులను, డజన్ల కొద్దీ మాజీ మంత్రులను అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో యువరాజులు మితెబ్ బిన్ అబ్దుల్లా, అల్వలీడ్ బిన్ తలాల్ సహా ట్విట్టర్, యాపిల్ సంస్థల్లో భారీగా పెట్టుబడిన పెట్టిన బడా వ్యాపార దిగ్గజాలు ఉన్నట్లు సమాచారం.

మనీ లాండరింగ్‌, లంచం, వ్యక్తిగత లాభం కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని దోచుకోవడం, దోపిడీ చేయడం వంటి ఆరోపణల కారణంగా యువరాజులు, మంత్రులు, వ్యాపార దిగ్గజాలు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులను మొత్తంగా 200 మందికి పైగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సౌదీ అటార్నీ జనరల్ షేక్ సౌద్ అల్ మోజిబ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా 6.5 లక్షల కోట్లమేర కుంభకోణాలు జరిగినట్లు గుర్తించడంతో కింగ్ సల్మాన్ విచారణకు ఆదేశించగా పోలీసుల ఆకస్మిక దాడులు చేపట్టినట్లు తెలిపారు.
Related News Articles