Home >> News >> Nation>> ఆ నాయకుడిని నేనే హత్య చేశా..

ఆ నాయకుడిని నేనే హత్య చేశా..
Published Date :11/15/2017 8:25:29 AM
ఆ నాయకుడిని నేనే హత్య చేశా..

హిందూ సంఘర్ష్‌ సేనా నాయకుడుని తానే హత్య చేశానంటూ ఓ గ్యాంగ్‌స్టర్‌ చేసిన పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లో గ్యాంగ్‌స్టర్‌ సరజ్‌ సంధూ పోస్టుతో పంజాబ్‌ పోలీసులు షాక్‌ తిన్నారు. విపన్‌ శర్మ హత్య కేసును చేధించేందుకు కొన్నాళ్లుగా పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత నెల 30వ తేదీన విపన్‌ శర్మ హత్య తర్వాత సరజ్‌ పరారీలో ఉన్నాడు.

సంధూ ఫేస్‌బుక్‌ పోస్టుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సంధూనే ఆ పోస్టు చేశాడా? వేరే ఎవరైనా చేశారా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీకారంతోనే విపన్‌ శర్మను హత్య చేసినట్లు సంధూ తన పోస్టులో చెప్పాడు. తన స్నేహితుడి తండ్రిని విపన్‌ చంపడానికి యత్నించాడని, అందుకే విపన్‌ను చంపినట్లు పేర్కొన్నాడు. పోలీసులు క్రిమినల్స్‌కు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలతో గత వారం సంధూ తల్లిని పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

విపన్‌ శర్మ శరీరంలోకి ఏడు బుల్లెట్లు కాల్చుతున్న సంధూ సీసీటీవీ ఫుటేజిని పోలీసులు స్వాధీనం కూడా చేసుకున్నారు. అయితే, ముసుగు కప్పుకుని కాల్పులకు పాల్పడటంతో పలు కోణాల్లో దర్యాప్తు చేయాల్సివచ్చింది. పంజాబ్‌లోని పలు హిందూ నాయకుల హత్యకు కుట్ర చేస్తున్న ఓ టెర్రర్‌ గ్రూప్‌ను పోలీసులు గత వారం పట్టుకున్నారు.
Related News Articles