Home >> News >> Films>> హనుమంత్ కు ముద్దుపెట్టిన రామ్‌ గోపాల్‌

హనుమంత్ కు ముద్దుపెట్టిన రామ్‌ గోపాల్‌
Published Date :8/26/2017 9:16:19 AM
హనుమంత్ కు ముద్దుపెట్టిన రామ్‌ గోపాల్‌

సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుకు సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ముద్దు పెట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పెళ్లి చూపులు ఫేం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి చిత్రం శుక్రవారం విడుదలైంది. మొదట నుంచి అనుకున్నట్లు గానే.. బోల్డ్ మూవీగా వచ్చిన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌తో పాటు రిలీజ్‌కు ముందు వి. హనుమంతరావు సినిమా పోస్టర్లు చించేయడంతో సినిమాకు కావల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది.

సినిమా పోస్టర్ యూత్‌ను చెడగొట్టేలా ఉందని వీహెచ్ చించేస్తే, వీహెచ్ దుస్తులు చించేయాలని రామ్‌ గోపాల్‌ వర్మ విజయ్‌కు సూచించడంతో వివాదం రాజుకుంది. అయితే.. ఈ వ్యవహారంపై ఎవరో ఎడిట్ చేసిన ఫొటోను ఆర్జీవీ తన ఖాతాలో పోస్ట్ చేశాడు. గతంలో అనురాగ్ కశ్యప్‌కు ముద్దు పెడుతూ ఇన్‌స్టాగ్రాంలో ఆర్జీవీ ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో అనురాగ్‌కు బదులు వీహెచ్‌కు వర్మ ముద్దు పెడుతున్నట్లు ఓ ఫొటోను ఎవరో ఎడిట్ చేశారు. ఆ ఎడిట్ చేసిన ఫొటోను వర్మ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి వెటకారంగా కామెంట్స్ చేశాడు వర్మ. ఇది బాగా వైరలవుతుంది.
Related News Articles